Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన దేవమ్మకు రూ.11వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసినట్టు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవమ్మ అనారోగ్యానికి గురికాగా ప్రయివేట్ చికిత్స నమిత్తం సీఎంరిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూ రైన రూ.11వేల చెక్కును అందజేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో కృషి చేస్తుంద న్నారు. ఈ కార్యక్రమంలో చౌదర్పల్లి సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య, వార్డు సభ్యులు యాదయ్య, రైతు కమిటీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, మస్క వెంకటయ్య, బంధులాల్, శరత్, కుమార్ గౌడ్, బాలయ్య, దస్తగిరి, రాజు, రవి, బాల చెన్నయ్య, సాయి, శ్రీశైలం పాల్గొన్నారు.