Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలకొండపల్లి
సమాజంలో సావిత్రిభాయి ఎనలేని కృషి చేశారనీ, ఆమె ఆశయాలు ప్రతి ఒక్కరూ నెరవేర్చానలి ఎంపీపీ నిర్మాల అన్నారు. సావిత్రిబాయి126వ వర్థంతి వేడుకలు శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడానికి సావిత్రిబాయి ఆ కాలంలోనే నడుము బిగించి, వీటన్నింటికీ సమూలంగా మార్పులు రావాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా చదువుకుని, విద్యావేత్తలు కావాలని కలలుకన్న మహానీయురాలని కొని యాడారు. సావిత్రిభాయిపూలే మృతి చెంది శతాబ్దం పూర్తైనా, ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొని యాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఏపీఓ రఘు, సూపరేట్ శ్యాంసుందర్, గ్రామపంచాయతీ కార్యదర్శులు రాఘవేందర్, చంద్రశేఖర్, బాల్రాజ్, వజిత్, జంగయ్య, రమేష్, అటెండర్లు రమేష్, యాదయ్య, సీనియర్ అసిస్టెంట్ రాధాకృష్ణ పాల్గొన్నారు.