Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-కందుకూరు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాల మోపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. శుక్రవారం జైతారం, కొత్తగూడ, గూడూరు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రకంగా ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. అనంతరం ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ నిరుపేదలపై అధిక భారం వేస్తుందన్నారు.ఈ కార్య క్రమంలో మహేశ్వరం మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కొత్తగూడ మాజీ సర్పంచ్ రావిచెట్టు యాదయ్య, మాజీ డైరెక్టర్ సామప్రకాశ్ రెడ్డి, ఎంపీటీసీ కాకి రాములు, డైరెక్టర్ పొట్టి ఆనంద్, రాచులూరు మాజీ సర్పంచ్ సదానందగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల యాదయ్య, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, సామయ్య, వెంక టేష్, మక్తాల వెంకటేష్‌గౌడ్, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.