Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు
- జిల్లాలో 9186 మంది ఓటర్లు
- జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- ఉదయం 8గంటల నుంచి
- సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
- ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. 9186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ కాలేజ్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుండి ఎన్నికల సిబ్బంది ఆదివారం పోలింగ్ సామా గ్రిని తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. వారి కోసం ప్రత్యేకంగా సమకూర్చిన వాహనాలలో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ హరీష్ ఉదయం వేళలోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు చేరుకుని పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. సామగ్రి పంపిణీలో ఎలాంటి తప్పిదాలకు, గందరగోళానికి తావులేకుండా క్రమ పద్ధతిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలి పారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. జిల్లాలో 9186 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కును పొందినట్టు వెల్లడించారు. ఇందులో పురుషులు 4870 మంది, 4315 మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు తెలిపారు. కాగా, పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రిసైడిం గ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రిని జాగ్రత్తగా సరిచూసుకుని తమ వెంట పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.