Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్వ్యాఖ్యలను నిరసిస్తూ మాదాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజరు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడు తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజరు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి రాష్ట్రంలో రోజురోజుకీ ఆదరణ తగ్గడం తట్టుకోలేక బండి సంజరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా డని అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే బండి సం జరు పని అన్నారు. బండి సంజరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామన్నారు. హద్దు మీరి మా ట్లాడే ముందు బండి సంజరు ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు. కరీంనగర్లో బండి సం జరు చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. సభ్యత సం స్కారాలు మర్చి మహిళలపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజరుని తెలంగాణలో ఏ ఒక్క చోట కూడా తిరగనివ్వమని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, గౌరవ అధ్యక్షులు ఈ.శ్రీనివాస్‌గౌడ్, డివిజన్ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, శ్యామ్, అనిల్ కుమార్ కావూరి, రఘునాథ్, వార్డ్ సభ్యులు గుమ్మడి శ్రీనివాస్ రామచందర్, ఓ.కృష్ణ, గోపాల్ నాయక్, సహదేవ్, అర్జున్, లోకేష్, కిట్టు,రాజు, ప్రభు, వెంకటేష్, గోపాల్, లాలూనా యక్, హున్యనాయక్, సయ్యద్ సదిక్, నూరుద్దీన్, అలీ, అమీర్, ఆఫ్రోజ్, శ్రీనివాస్‌గౌడ్, రాజు, మహీందర్, తైలి కృష్ణ, కష్ణనాయక్, బాలరాజు, అంకారావు, బృందరావు, జైపాల్, మహిళ శ్రేణులు, కాలనీవాసులు పాల్గొన్నారు.