Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్ధాపకురాలు రాజేశ్వరమ్మ
నవతెలంగాణ-కుల్కచర్ల
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్ధాపకురాలు రాజేశ్వరమ్మ అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండలం పుట్టాపహడు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల వల్ల మానసిక శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అన్నిరంగాలలో రాణించాలన్నారు. అనంతరం ఆమెను నిర్వాహ కులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అఖిలభారత గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జానకిరామ్, స్థానిక యువకులు, నాయకులు పాల్గొన్నారు.