Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలు ఇచ్చేంతవరకూ పోరాటం ఆగదు
- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 75లో4 ఎక రాల 2 గుంటల ప్రభుత్వ భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు గత నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నేటికీ 27 రోజులు గడుస్తున్న సందర్భంగా గుడిసె వాసు లను ఉద్దేశించి సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామ స్వామి మాట్లాడుతూ..గుడిసెలు వేసుకుని 27 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీ వ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని చెప్పిన ప్ర భుత్వం 8 ఏండ్లు పూర్తయినా ఎక్కడా డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వలేదని అందుకే ఇల్లు లేని పేద ప్రజలు సం ఘటితమై ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారని పట్టాలు వచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని ఉం టే గుడిసెలలో ఉంటాము లేదంటే జైల్లో ఉంటామని గు డిసె వాసులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు స్థా నిక ఎమ్మెల్యే చొరవ చూపి గుడిసేవాసులకు మౌలిక సదు పాయాలు కరెంటు, మంచినీరు, మొబైల్, టాయిలెట్స్ ఏ ర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమం లో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం.ప్రభు లింగం, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, బీకేయంయు జిల్లా అధ్యక్షుడు అంజయ్య, మండల పార్టీ కార్యదర్శి మ ల్గారి సత్తిరెడ్డి, షాబాద్ మండల కార్యదర్శి జంగయ్య, ఏఐ టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివయ్య, అధ్యక్షుడు శివ, బీఓసీ కార్యదర్శి శ్రీను, మండల మహిళా సమాఖ్య అ ధ్యక్షురాలు మంజుల, విజయమ్మ, మీనాక్షి, సాయిలమ్మ పాల్గొన్నారు.