Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి
- మంజుల రమేష్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని మున్సిపల్ చైర్ పర్స న్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కుమార్ అన్నారు. శనివారం సెంట్ ఆంథోనీ స్కూ ల్లో జరిగిన స్టూడెంట్ అవార్డు సెరిమని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ చదువు ఒక్కటే కాకుండా వి ద్యార్థులు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లాంటి అన్ని రంగా ల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూసి అనవసర విషయాల పట్ల పక్కదారి పట్ట కూ డదన్నారు. ప్రకృతిని కాపాడడం, చుట్టుపక్కల పరిస రాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని గుర్తుచేశారు. ర్యాంకుల వెంట పరిగెత్తకుండా విద్యా ర్థులకు కావలసిన మెరుగైన విద్యను అందించ డంలో పాఠశాలల యాజమాన్యాలు సహక రించాలని కోరారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా నిర్వహిం చిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబ రిచిన విద్యార్థులకు బహుమతులను ము న్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమే ష్కుమార్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సి లర్ సురేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగు ళ్లపల్లి రమేష్ కుమార్, పాఠశాల వ్యవస్థాపకులు లూ యిస్, ప్రిన్సిపల్ అర్చన, నాగయ్య, పాఠశాల ఉపాధ్యాయు లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.