Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా చలివేంద్రాన్ని సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.రఘనాథ్ ఆదివారం జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేం దర్, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సిలి వెరు మాధవులు తదితరులతో కలిసి ప్రారంభించారు. సం దర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రానికి మొదటిసారి విచ్చేసిన న్యాయ వాది రఘునాథ్‌ను స్థానిక నాయకులు పూలమాలలు శాలు వాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహంతో పాటు పూలే, సావిత్రి బాయి పూలే, స్వామి వివేకానంద తదితరుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, ఎంపీటీసీలు లచ్ఛిరామ్ నాయక్, మం జుల చంద్రమౌళి, అనుమాస్పల్లి సర్పంచ్ పోతు గంటి శంకర్, ఉపసర్పంచ్లు రామకృష్ణ, అనిల్‌యాదవ్, అంబే ద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు సిద్దిగారి దా సు, వివిధ సంఘాల, పార్టీల నాయకులు కె.వెంకటేష్, పి. వెంకటేష్, మూడరవి, డి.మహేష్, భిక్షపతి, మోహ న్‌రెడ్డి, ప్రేమ్నాయక్, సాయిలాల్, ఇర్షాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.