Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ గుప్త
- మండలాధ్యక్షునిగా శ్రీనివాస్ గుప్త మూడోసారి ఎన్నిక
నవతెలంగాణ-యాచారం
ఆర్యవైశ్యుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ గుప్త డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని మాల్ కేంద్రంలో ఉన్న ఊరే యాదయ్య గార్డెన్ లో ఆర్యవైశ్యుల సమావేశం జరిగింది. అనంతరం ఆర్య వైశ్యుల మండల అధ్యక్షునిగా వీరబొమ్మల శ్రీనివాస్ గుప్తా ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఆర్యవైశ్యుల సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ మాట్లాడుతూ చట్టసభలలో ఆర్యవైశ్యులకు రిజర్వేషన్ పెం చాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాటా ఇవ్వా లని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆర్యవైశ్యుల అభి వృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. కొత్తగా ఎన్ని కైన మండలాధ్యక్షుడు ఆర్యవైశ్యుల సమస్యలపై ఎప్పటిక ప్పుడు సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వాలు ఆర్యవైశ్యుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చే యకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అ నంతరం ఆర్యవైశ్యుల సంఘం పెద్దలు శ్రీనివాస్ గుప్తకు అభినందనలు తెలిపారు. శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ మండలంలో సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ ఆర్యవైశ్యుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కా ర్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా కోశాధికారి బిలకంటి కిరణ్, మండల మాజీ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్, వీరబొమ్మల రాజు, నాళ్ల మురళీకృష్ణ, ఆలంపల్లి నారాయ ణ, ఆలంపల్లి యాదగిరి, కాసం సురేష్, శ్రీ లక్ష్మణ్, ఆర్య వైశ్య సోదరులు పాల్గొన్నారు.