Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్టీ జోన్ శ్రీ షానవాజ్ కాశీమ్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని మల్టీ జోన్ షానవాజ్ కాశీమ్ పరిశీలించారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా డీటీసీ అదనపు ఎస్పి మురళీధర్ పుష్పగుచ్చం ఇచ్చి, పోలీస్ అధికారులతో గౌరవ వందనం చేశారు. అనంతరం డీటీసీలోని పరేడ్ గ్రౌండ్, బ్యారేక్లు, మంచి నీటి వసతు లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తరగతి గదులు, వంట గదులు మొదలగునవి అన్నీ పరిశీలించారు. జిల్లాకు పోలీస్ శిక్షణకు రాబోయే పోలీస్ సిబ్బందికి వసతులలో, శిక్షణ, గ్రౌండ్ మొదలైన వాటిల్లో ఎలాంటి ఇబ్బంది ఉండ కుండా చూడాలని, ఏమైనా మరమ్మతులుంటే వెంటనే పూర్తిచేసి శిక్షణా కేంద్రాన్ని సిద్దంగా ఉంచాలన్నారు. శిక్షణా కేంద్రంలో స్వచ్చమైన గాలి, నీరు, ఆహ్లాదకరమైన వాతావరణంతో బాగుందన్నారు. శిక్షణా కేంద్రంలో మొక్క లు నాటి అధికారులు, సిబ్బందితో మొక్కలు నాటించి, పో లీస్ అధికారులు సిబ్బందితో మాట్లాడుతూ డిటిసిని పరిశుభ్రంగా ఉంచుకొని మరిన్ని మొక్కలు నాటుకోవాలని, శిక్షణ కు వచ్చే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందిలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ముర ళీధర్, డీటీసీ డీస్పీ విజరు, వికారాబాద్ డీఎస్పీ సత్యనా రాయణ, డీఎస్బి ఇన్ప్సెక్టర్ శ్రీనివాస్ రావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, వికారాబాద్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను, ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పయ్య డీటీసీ ఇన్స్పె క్టర్ మల్లేశం ఆర్ఐలు రత్నంసూరపు నాయుడు పాల్గొన్నారు.