Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-పరిగి
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేయకుంటే 48గంటల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధ వారం పరిగి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. త్వరలో గవర్నర్, రాష్ట్రపతికి లేఖ రాస్తామని తెలిపారు. స్వచ్ఛందంగా టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వైదొలగాలనీ డిమాండ్ చేశారు. రూ.30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు. జనార్దన్‌రెడ్డి హ యాంలో జరిగిన పరీక్షలన్ని రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని కోరారు. టీఎస్పీఎస్సీ తెలంగాణ ప్రజల విశ్వసనీయత కోల్పోయింది. గ్రూప్1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలు బహిర్గతపరచాలన్నారు. టెక్నికల్ సమస్యగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్‌కు అప్ప గించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు. టీఎస్ పీఎస్సీసి చైర్మన్ జనార్దన్ రెడ్డిని, టీఎస్పీిఎస్సీ కమిటీని తొలగించి నూతనంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.