Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు
- వీఓఏలకు చీరల పంపిణీ
- ఈ నెల 20న పెద్దషాపుర్ ఎస్వీరెడ్డిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- విజయవంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-శంషాబాద్
సమాజాభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర ఉంటుంద ని శంషాబాద్ జడ్పీటీసీ నీరటీ తన్విరాజు ముదిరాజ్ అన్నారు. మహిళలను విస్మరిం చిన అణచివేతకు గురిచేసిన సమా జాభివృద్ధి చెందజాలదన్నారు. బుధవా రం మండలం పరిధిలోని వీఓఏలతో శంషాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ తన స్వంత నిధులతో 40 మంది వీఓఏలకు ఒక జత చొప్పున చీరలను ఉచితంగా పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహి ళలు ఆర్థికంగా ఎద గడానికి వీఓఏలు అనేక కష్టనష్టాలను ఓర్చుకొని శ్రమిస్తు న్నారని తెలిపారు. ఈనాటి ఆర్థిక ప్రగతికి డ్వాక్రా సంఘా ల అభివృద్ధిలో వాటిని ముందుండి నడిపించే వీఓఏలు, సీసీలు, మండల మహిళా సమాఖ్య పాత్ర అతిముఖ్యమైందన్నారు. వారిని గుర్తించి ప్రోత్స హించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు కుటుంబ పోషణ, పిల్లల పెంపకంతో పాటు సమాజ ఆర్థిక, సామాజిక అంశాల్లో కూడా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. తన పిల్లలకు మంచి విలువలు, పెద్దల పట్ల గౌరవం సమాజం పట్ల బాధ్యత నేర్పించి తన ముందున్న సవాళ్ళను సం తోషంతో స్వీకరించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మహిళలు ఉన్నత చదువులు చదవాల ని తమలో ఉన్నటు సృజనాత్మక ఆలోచన భవిష్యత్ తరాలకు అందించే విధంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. సమాజంలో మహిళలకు అనేక ఆటంకాలు ఎదు రవుతాయని వాటన్నింటినీ ఎదిరించాలని సూచించారు,. ఈ నెల 20న పెద్ద షాపూర్‌లోని ఎస్వీఆర్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినో త్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్ర మానికి ప్రతి గ్రామం నుంచి మహిళలు అధికసంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్ర మాలు ఆటలు, పాటలు, వ్యక్తిగత నైపుణ్యాలను ప్రద ర్శించే అవకాశముంటుందని తెలి పారు. ఈ అవకాశాన్ని మహిళలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య ఏపిఎంవి. అహల్య, పరా, హెచ్ఆర్సీ కోఆర్డినే టర్ శ్రీలత, నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనేగౌని శ్రీకాంత్ గౌడ్, సీసీలు రాజు, బావయ్య, యాద య్య నరేష్, జయలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు.