Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ జిల్లా నాయకులు చెరుకూరి రాజు
- ఇబ్రహీంపట్నంలో కాన్షీరాం జయంతి వేడుకలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బహుజనులంతా రాజకీయ శక్తిగా ఎదగాలని బీఎస్పీ జిల్లా నాయకులు చెరుకూరి రాజు అన్నారు. అణగారిన వర్గాల కోసం ఓట్లు..మావి సీట్లు మీవా..నహీ చలేగా అంటూ..సైకిల్‌పై గడప గడపకూ బహుజనోధ్యమాన్ని ప్రకటించి, బహుజన రాజ్యాన్ని స్థాపించిన మాన్వవర్ కాన్షీరం జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వ హించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీఎస్పీ జిల్లా నాయకులు చెరుకూరి రాజు ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గణేష్, జిల్లా ఇన్చార్జి గ్యార జగన్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు శాంత, నియోజకవర్గ ఇన్చార్జి పి. రాములు, ప్రధాన కార్యదర్శి దాసు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు కుమార్, మండల అధ్యక్షులు మచ్చ మహేందర్, మంచాల మండల అధ్యక్షులు ప్రసాద్, నాయకులు ప్రేమ్, వెంకట్, రాజేష్, భరత్, చిరంజీవి, గణేష్, సుమన్ పాల్గొన్నారు.