Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
తిరుమలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నామని తిరుమలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయా లన్నారు. గ్రామంలో ని పాఠశాలలో మౌలిక వసతులు లేక, విద్యార్థులు రాక మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. అలాంటి పాఠశాలను బలోపేతం చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తుల సహకారంతో చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. ముందుగా తాను స్వచ్ఛందంగా రెండు లక్షల రూపాయలతో పాఠశాలకు ప్రహరీ నిర్మిస్తు న్నామని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ చోరువతో కేవలం ఐదుగురి విద్యార్థులు ఉన్న పాఠశాలను 30 మంది విద్యార్థులు చదువుకునేలా కృషి చేసినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ముందుకు వచ్చి పాఠశాలలో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పాఠశాల భవనానికి రంగులు వేసి, విద్యార్థులను ఆకర్షించేలా బొమ్మలు, అక్ష రాలు రాసి, ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నట్టు తెలి పారు. అలాగే ప్రభుత్వం కూడా సహకరించి పాఠశాలకు నిధులు కేటాయించి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు.