Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్
- కడ్తాల్‌లో వైద్య శిబిరం
- 315 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేత
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కామినేని ఆస్పత్రి హైదరాబాద్ సంయుక్తల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. స్థానిక చెన్నకేశవస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ట్రస్ట్ అధ్యక్షులు ఉప్పల వెంకటేష్ ప్రారంభించారు. ఈసందర్భంగా డాక్టర్ ఉప్పల అఖిల్ సారధ్యంలోని వైద్యులు వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న 315 మందికి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఉప్పల ట్రస్ట్ సేవలు వివిధ రూపా ల్లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యంతో పాటు పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగ పడేవిధంగా ఆనేక సేవా కార్యక్రమాలు చేపడ్తున్నట్టు చెప్పారు. తలకొండపల్లి మండలంతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో వేల సంఖ్యలో ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం నెలకొన్న సీజనల్ వ్యాధుల భారినపడకుండా ప్రజ లను చైతన్యం చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉప్పల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలంగౌడ్, జిల్లా ఎంపీటీసీల ఫోరం గౌరవాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, తలకొండపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జర్పుల గోపాల్‌నాయక్, నాయకులు శేఖర్, గంప శ్రీనివాస్ గుప్తా, రంగయ్య, శ్రీనివాస్, సత్యం, మలె మల్లేష్ గౌడ్, మహేష్, తిరుపతి, రాజు, రవి యాదవ్, విజరు, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.