Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
అతివేగంతో ఉన్న రెండ్లు కార్లు డీకొన్నాయి.ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వంద ఫీట్ రోడ్డులో ఓవర్ స్పీడ్లో వెళుతున్న రెండు కార్లు అదుపు తప్పి ఒకదానికి ఒకటి ఢకొన్నాయి.ఈ సమయంలోనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో కారుల్లో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాలేదు. రెండు కార్లలోనూ యువతీ యువకులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే..వారు కార్లలో నుంచి దిగి వెళ్లిపోయారు. ఇద్దరు యువతులకు మాత్రం స్వల్పంగా గాయాలు అయ్యాయని, వారిని స్థానికుల ఆస్పత్రికి తరలించారు. దెబ్బతిన్న కార్లను మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మెరుకు కేసు నమోదు చేసుకుని, విచారించన్నుట్టు పోలీసులు తెలిపారు.