Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డీస్ కాలనీలోని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ గల్లాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో జీవిస్తున్న ప్రజలు ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరం సుమారు 200 మందికి రక్త పరీక్షలు, డెంటల్ చెకప్ చేసి,వారికి మందులు పంపిణీ చేసినట్టు కాలనీ అసోసియేషన్ తెలిపింది. ఈ కార్య క్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కోశాధి కారి పూర్ణానంద్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.