Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
- నేలలకు అనువైన సీడ్స్‌ను అందించాలి
- సేంద్రియ ఎరువులతో భూసారాన్ని కాపాడుకోవాలి
- షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
సిజంటా సీడ్స్‌తో అధిక దిగుబడులు వస్తాయని, దీనికి తోడుగా రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ అన్నారు. కేశం పేట మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ విశ్వనాథం వ్యవ సాయ క్షేత్రంలో సింజెంటా సీడ్స్ ఆధ్వర్యంలో సాగుచేసిన పలు రకాల కూరగాయ, పండ్ల తోటలను స్థానిక ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన కేశంపేట మండలంలో మల్టీ నేషనల్ సంస్థ సింజెంటా కూరగాయలు, పండ్ల తోటలకు సంబంధించిన సీడ్స్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీ యమన్నారు. రైతులు పంటలో అధిక దిగుబడి సాధిం చాలంటే తప్పనిసరిగా పంటల మార్పిడి చేయాలని తెలి పారు. తెలంగాణ ప్రభుత్వం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతు వేదికల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందజేస్తుందని, శాస్త్రవేత్తల సూ చనలతోపాటు సింజెంటా వంటి సంస్థల సలహాలను పా టించి రైతులు అధిక దిగుబడులు పొందడంతోపాటు మంచి లాభాలు అర్జించాలని ఆకాంక్షించారు. రసాయన ఎరువుల వాడకాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ భూసారాన్ని కాపాడుకోవాల న్నారు. సింజెంటా సంస్థ అత్యాధునికమైన 27 రకాల సీడ్స్‌ను రైతులకు అందుబాటులో ఉంచడం సంతోషకర మన్నారు. సంస్థ ప్రతినిధులు రైతులకు అందుబాటులో ఉంటూ కావాల్సిన సహాయ, సహకారాలు సంస్థ ప్రతి నిధులు అందించి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. వ్యవసాయం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సాగు సామర్థ్యం పెరిగిందంటే అది సీఎం కేసీఆర్ ఘనతనేనని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా మరుగున పడిపోయిన చెరువుల అభివృద్ధి, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఇందుకు నిదర్శనం అన్నారు. రసాయన చెరువుల వాడకాన్ని నిలిప ివేసి అధిక మొత్తంలో సేంద్రియ ఎరువులను ఉప యోగించి భూసారని కాపాడుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ శిరీష, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, సర్పంచులు వెంకట్‌రెడ్డి, తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి, నవీన్‌కుమార్, బడ్క పార్వతమ్మ వెంకటయ్య, ఉప సర్పంచులు గంజాయి దశరథం, మల్లయ్య, ఎంపీటీసీ మల్లేష్‌యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ మఠం చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, సంస్థ ప్రతినిధి కమల్ కన్నన్, ఆయా గ్రామాల రైతులతోపాటు, తదితరులు పాల్గొన్నారు.