Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-యాచారం
అకాల వర్షానికి వడగండ్లతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని మంతన్ గౌరెల్లిలో వడగండ్లతో దెబ్బ తిన్న ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగండ్ల బీభత్సంతో వంటలు, కోళ్ల ఫారాలు, పండ్ల తోటలు, రేకులపిండ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పంట నష్టాన్ని అంచనా వేసి, వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభు త్వం బాధితులందరికీ అండగా నిలబడి పరిహారం అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కొర్ర జ్యోతి అరవింద్, కాంగ్రెస్ నాయకులు గుర్నాథ్ రెడ్డి, మస్కు నరసింహ, మోటే శ్రీశైలం, రాజు, రమేష్, కౌన్సిలర్ కొత్త కురమ మంగమ్మ, స్వభావత్ మధుకర్, అఖిల్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.