Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్టల్ టౌన్షిప్ వెల్పర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కోలన్ ప్రతాప్‌రెడ్డి,మర్పల్లి అశోక్
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలోని క్రిస్టల్ టౌన్షిప్లో కరెంట్ పోల్స్‌కు ఉన్న పాత తీగెలను తొలగించి, కొత్త విద్యుత్ తీగెలను అమర్చి, ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని క్రిస్టల్ టౌన్షిప్ వెల్పర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కోలన్ ప్రతాప్‌రెడ్డి, మర్పల్లి అశోక్ అన్నారు. శుక్రవారం టౌన్షిప్ వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ ప్రదీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంట్ లోవోల్టేజ్ సమస్య బాగా ఉందని పాత వైర్లు తెగి కింద పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయని తెలిపారు. అదేవిధంగా కరెంట్ బిల్లులు అదికంగా వస్తున్నాయని బిల్లులపైన కూడా దృష్టి సారించాలని సూచించారు. కాలనీలో పాత ట్రాన్స్ ఫార్మర్ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని కోరారు. గురువారం పడిన ఈదురు గాలులు, వడగండ్ల వానకు స్థంభం పైనుంచి విద్యుత్ తీగెలు తెగి పడ్డాయన్నారు. కానీ ఈ రోడ్డు వెంబడి ఎప్పుడు పిల్లలు, పెద్దలు,వాహనాలు తిరిగే ప్రధాన రహదారి అన్నిఆ ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోవింద్‌రెడ్డి, కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, మురహరి, సభ్యులు నాగయ్య, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.