Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్, తదితర ప్రాంతాల కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నాగార్జున ఎనక్లేవ్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియే షన్‌కు నూతనంగా ఎన్నికైన సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా సభ్యులను సన్మానిం చి, అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ నాగార్జున ఎనక్లేవ్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనవంతు సహకారం ఎప్పడూ ఉంటుందన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కా రిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ఎనక్లేవ్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ కాట్రగడ్డ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు యుఎస్ రామరాజు, జనరల్ సెక్రటరీ పిడిఆర్కె వర్మ, వైస్ ప్రెసిడెంట్ రమణరెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధీర్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ అశోక్‌రెడ్డి, ఎక్జిక్యూటివ్ మెంబర్లు కెవి గోపాల్ కృష్ణ, కోసురి లక్ష్మీ, మెరినా ఎర్లాండ్, సీతారామరాజు భూపతి రాజు, వెంకటేశ్వరరావు, రామలింగ రాజు, శ్రీమన్నారాయణమూ ర్తి, అడ్వైజరీ కమిటీ మెంబర్లు కునపరాజు, రాజన్‌రాజు, కోసురి శ్రీనివాసరాజు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.