Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
కుల, మత వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సీఎం ఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తున్నదని షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ అన్నారు. లబ్దిదా రులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. నిర్ధవెళ్లి గ్రామానికి చెందిన కొత్త శృతికి రూ. 60వేలు, బడ్క ఎల్లయ్యకు రూ.56వేలు, అవ్వారి ఉమా పతికి రూ.60వేలు, శ్యాంరావు తండా గోవింద్‌కు రూ. 60వేలు, కొత్తపేట గ్రామానికి చెందిన చక్కల రవికి రూ. 36వేలు, మహమ్మద్ దిల్షాద్కు రూ.24వేలు, పోచారం సువర్ణకు రూ.10వేల 500లు, ఇప్పలపల్లి గ్రామానికి చెం దిన మొయీనోద్దీన్ (చోటు) అనారోగ్యంతో హాస్ఫిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్యకు రూ. లక్ష 50వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రవణ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పార్వత మ్మవెంకటయ్య, నవీన్‌కుమార్, ఆంజనేయులు, ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, సింగిల్ విండో చైర్మన్ గండ్ర జగదీశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్‌రెడ్డి, పర్వత్ రెడ్డి, రాజశేఖర్ గుప్తా, ధనరాజ్ రెడ్డి, గణేష్‌గౌడ్, బండ నిరంజన్, ఫైజన్ ఖాన్, జగన్ రెడ్డి, తిర్మల్ రెడ్డి, శ్రీనివాస్, కుంటి లక్ష్మయ్య, మెహ్రాజ్, తదితరులు పాల్గొన్నారు.