Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి
- పేపర్ లీక్స్ పై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన
నవతెలంగాణ-మొయినాబాద్
టీఎస్టీఎస్సీలో పేపర్ లీక్స్ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు చల్లా నరసిం హారెడ్డి డిమాండ్ చేశారు. టీపీసీసీ పిలుపులో భాగంగా ఆదివారం మొయినాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పట్నం రామ్‌రెడ్డి, టీపీసీసీ ఫిషర్మెన్ కార్యదర్శి నారాయణపురం మహేందర్ ముదిరాజు, మాజీ ఎంపీటీసీ మాధవ రెడ్డి, జిల్లా నాయకులు జంగారెడ్డి, మండల కిసాన్ అధ్యక్షులు బొక్క వెంకట్‌రెడ్డి, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గన్నేపాక నర్సింగ్‌రావు, మల్లేష్‌గౌడ్, సత్యనారాయణ బాబున్న, మాజీ ఉపసర్పంచ్ కావాలి రమేష్ ముదిరాజు, అజిత్ నగర్ గ్రామ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,పెద్ద మంగళం గ్రామ అధ్యక్షులు అనంత రెడ్డి, రాఘవరెడ్డి, అల్లం మాణిక్‌రెడ్డి, భిక్షపతిముదిరాజు, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రాల భాస్కర్, కాంగ్రెస్ నాయకులు పి కుమార్, బాకారం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.