Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- ఆమనగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్
ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకులు స్వంత లాభం కొంత మానుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ ఆధ్వ ర్యంలో ప్రతిమ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని అనారోగ్య బాధితులకు ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకు లు రాయితీలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం మంత్రి స్థానిక ప్రజాప్రతినిధు లతో కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖానాపూర్ గ్రామానికి తరలి వెళ్లారు. మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల జబ్బులతో, ముఖ్యంగా గుండె జబ్బులతో బాధప డుతున్న 320 మందికి పరీక్షలు నిర్వహించారు. వారికి కావాల్సిన మందులతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్టు చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సరోజ, సూపర్వైజర్ శ్రీశైలం, ప్రతిమ ఆస్పత్రి కాచిగూడ కార్డి యాలజీ వైద్య బృందం రాజ్కుమార్యాదవ్, విక్రమ్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతునాయక్, దోనాదుల కుమార్, డైరెక్టర్లు సురమళ్ళ సుభాష్, లాయఖ్ అలి, రమేష్ నాయక్, నాయకులు సయ్యద్ ఖలీల్, రాములుయాదవ్, శ్రీధర్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీను, రమేష్ యాదవ్, నరేందర్, పూల్య నాయక్, రాజు, మార్కెట్ సిబ్బంది వినోద్, మల్లేష్, శరత్, శ్రీశైలం, కృష్ణ, శంకర్, కరుణాకర్ పాల్గొన్నారు.