Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11వ పీఆర్సీని అమలు చేయాలి
- రెండేండ్లుగా అమలు కావడం లేదు
- కార్మిక సంఘం నేతలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని కోరుతూ సోమవారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట తాండూరు మున్సి పల్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను వినతి పత్రా న్ని అందజేశారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయ కులు ఎండీ యూసుఫ్, యేసు రత్నంలు మాట్లాడుతూ.. రెండేండ్లుగా కార్మికులకు 11వ పీఆర్సీ వేతనాలు అమలు కాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు గురికాల్చి వస్తుందన్నారు. రెండేండ్లుగా పీఆర్సీ వేతనాలు అమలు కాకపోవడం దారుణమన్నారు. మున్సిపల్లో జరుగుతు న్న రాజకీయ పరిణా మాలతో కార్మికులకు అన్యాయం జరు గుతుందని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సి పల్ బడ్జెట్ మీటింగు ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు గోపా ల్, వీరప్ప భూపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.