Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బురదనీటిలో నడవలేక విద్యార్థుల అవస్థలు
- సమస్యను పరిష్కారించాలని బీఎస్పీ డిమాండ్
నవతెలంగాణ-బంట్వారం
మండల పరిధిలోని తొర్మామిడిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో భారీ గా కురిసిన వర్షానికి నీళ్లు చేరిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, వెం టనే సమస్యను పరిష్కారించాలని బీఎస్పీ మండల అధ్యక్షులు సయ్యద్ బాబా అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీగా కురిసిన వర్షానికి ఉ ర్దూ మీడియం పాఠశాల్లో నీరు చేరిపోయి చెరువును తలపించే విధంగా పాఠ శాల ఆవరణం తయారైందని, విద్యార్థులు బురదనీటిలో నడవలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. వర్షం పడితేచాలు పాఠశాల్లో, తరగతి గదుల్లో నీరు చేరుతుందని, ఇలాగే కొనసాగితే పాఠశాల్లో విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదంటూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన ఊరు మన బడి' కార్యక్రమం తొర్మామిడిలోని ఉర్దూ మీడియం పాఠశాలకు వర్తిం చదా అని ప్రశ్నిచారు. విద్యాధికారులు వెంటనే పాఠశాలలో నెలకొన్న సమస్య ను పరిష్కరించాలని బీఎస్పీ తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సయ్యద్గౌస్, బీఎస్పీ నాయకు లు పాల్గొన్నారు.