Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వికారాబాద్ కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతు న్నందున ప్రజావాణికి జిల్లాలో విశేష స్పందన లభిస్తున్నది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చూపుతున్న చొర వ పట్ల ప్రజలు ఆకర్షితులై తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్ర మానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మంది రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 398 దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుండి సా యంత్రం 4:00 గంటల వరకు ఫిర్యాదుదారుల నుండి స్వీకరించారు. కలె క్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని, స్వీకరిం చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత శాఖలు పరిష్కారించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశో క్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.