Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
- చెత్త సేకరణ ఆటోలు ప్రారంభం
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ప్రతి ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ ఆటోలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజా అవసరాల నిమిత్తం ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం 55 ఆటోలు అందుబాటు లో ఉన్నప్పటికీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 20 కొత్త ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చామ న్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ మహేందర్‌గౌడ్, కార్పొరేటర్లు సాగర్, అస్లాంబీన్, కో- ఆప్షన్ సభ్యులు మాలకీరత్నం, జగదీష్, నాయకులు నాగ రాజు, పాపయ్యయాదవ్, పాండు టీంకురెడ్డి, రజాక్బాయ్, శ్రీశైలం, సుమన్, రాజు, అధికారులు పాల్గొన్నారు.