Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
శోభకృతి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని చందానగర్లో గల విశాఖ శారదా పీఠ పాలిత పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామియాదవ్ ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుకగా కౌండిన్య నండూరి వెంకటేశ్వర రాజు ప్రార్థనా శ్లోకాలు పఠిస్తూ పండితులను సభకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన సత్య సాయి జ్యోతి ప్రజ్వలన గావించి, ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కటకం వెంకటరామ శర్మ అధ్యక్షత వహించారు. ఈ కార్య క్రమంలో శతావధాని మలుగ అంజయ్య , డాక్టర్ రాజారత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు.. ఉగాది పండుగ గురించి వివరించారు. ఈ కవి సమ్మేళనంలో 50 మంది కవులు పాల్గొని, తమ కవిత గానంతో సభను అలరించారు. తదనంతరం కవులను, అతిథులను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చాలతో పాటు సాంప్రదాయబద్ధ్దంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జనార్ధన్, పాలం శ్రీను, విజయలక్ష్మి, వాణి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.