Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాళ్లు, కర్రలతో జేసీబీల ధ్వంసం
- అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల పై దౌర్జన్యం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్ఎండీఏ అధికారులు
నవతెలంగాణ- శంషాబాద్
హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడా నికి వచ్చిన అధికారులపై అక్రమంగా కబ్జా చేసిన వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 725/21,/ 23, /24 లలో 180 ఎకరాల హెచ్ఎండీఏ భూమి ఉంది. భూమిని ప్రభుత్వ అవసరాల నిమిత్తం అప్పట్లో భూ సేకరణ చేసింది. అప్పటి నుంచి ఆ భూమిని తమ ఆధీనంలో ఉంచుకుంది. ఈ భూమిలో హెచ్ఎండీఏ అధికారులు ఏడీ సర్వే చేయడానికి మధ్యాహ్నం సైట్ వద్దకు వచ్చారు. అక్కడ కొంత మంది భూమిని ఆక్రమించి చుట్టూ రేకులతో కూడిన ప్రహరీ గోడ నిర్మాణం చేసుకు న్నారు. ఈ సందర్భంలో సర్వే చేయడానికి అడ్డంగా ఉన్న రేకుల తొల గించే క్రమంలో ఘర్షణ ఏర్పడింది. వారం రోజులుగా అక్కడే తిష్ట వేసిన కొంతమంది వ్యక్తులు వచ్చి సర్వే అడ్డుకోవడంతోపాటు హెచ్ఎండీఏ అధికారులపైనా దాడికి దిగారు. రక్షణగా వచ్చిన పోలీసుల పైన దాడి చేశారు. అంతటితో ఆగకుండా జేసీబీలపై బండరాళ్లు వేశారు. దీంతో రెండు జేసీబీలు ధ్వంసం కావడమే కాకుండా వాటిని నడుపుతున్న డ్రైవర్లకు గాయాలు అయ్యాయి. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తూ సుమారు పదిమంది వ్యక్తులు అకారణంగా తమపై దాడి చేశారని హెచ్ఎండీఏ ఏఈఓ కీర్తి చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై 353, 324, 427, 447, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడులకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మీడియాకు వివరాలు తెలపడానికి
అధికారుల నిరాకరణ
ఘటనకు సంబంధించిన వివరాలను గురుంచి అధికారులను మీడియా ప్రతినిధులు అడిగే ప్రయత్నం చేస్తే తాము ఏం చెప్పలేమని ఉన్న అధికారి గంగాధర్‌ను అడగాలని చెప్పారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న అధికారులు జరిగిన సంఘటన వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. నగరంలో ఉన్న అధికారులను అడగడం ఎలా కుదురుతుం ది అంటే ఇంతకన్నా ఏం చెప్పలేమంటూ దాటవేశారు. సర్వేకొచ్చిన అధికారులు మీడియాకు వివరాలు తెలపడాని కి వెనుకడుగు వేయడానికి గల కారణాలు చెప్పకపోవడం తో అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.