Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వచ్చేనెల ఏప్రిల్‌లో జరిగే పదవ తరగతి పరీక్షలకు గెజిటెడ్ ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం రాజేంద్రనగర్‌లోని గురునా నక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్ర మానికి రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి, నార్సింగ్, షాబాద్, చేవెళ్ల, నందిగామ, కొత్తూరు, ఫారూ క్నగర్, చౌదరీగూడ, కొందుర్గ్, మొయినాబాద్, కేశంపేట మండలాల నుండి మొత్తం 220 మంది గెజిటెడ్ ప్రధానో ధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు, సెంటర్ కస్తోడియ న్లు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సుషిందర్రావు హాజరై మాట్లాడారు.. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామీనేషన్స్ సబ్రమనేశ్వరి, స్థానిక మండల విద్యాధికారి దార్గుల రామి రెడ్డి, శిక్షకులు నర్సింహారావు, సెక్రటరీ రాంచందర్‌రెడ్డి, మండల విద్యాధికారులు, స్థానిక పాఠశాల కరెస్పాండెట్ సజ్జన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.