Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాకొద్దు మోడీ పాలన
జీపు జాత బృందాల ఎదుట గోడు వెల్లబోసకున్న సామాన్యులు
పేదలపై పన్నులు..
- నిత్యవసర ధరల పెంపుతో పెరిగిన ఆకలి చావులు
- పని లేక.. బతుకెళ్తాలేదని ఆవేదన
- రంగారెడ్డి జిల్లాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీపు జాతాలు
- మోడీ దుర్మార్గపు పాలనపై గడపగడపకూ..
- మోడీని గద్దేదించేందుకు పోరుకు సిద్ధమంటున్న ప్రజలు
- నేడు ఇబ్రహీంపట్నంలో ముగింపు బహిరంగ సభ
పేదల కష్టాన్ని పన్నుల రూపంలో దోచుకుని, పెట్టుబడిదారులకు సబ్సిడీల పేరుతో దేశాన్ని దోచిపెడుతున్న మోడీ పాలన మాకొద్దని సామాన్యులు తేల్చి చెబుతున్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలతో తాము ఎన్నీ ఇబ్బందులు పడుతున్నామో జీపు జాత బృందాల ఎదుట వెల్లబోసుకున్నారు. పని లేక బతుకెళ్తాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని గద్దె దించేందుకు పోరుకు సిద్ధమంటున్నారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జీపుజాతాలు చేపట్టారు. యాచారం, శంకర్పల్లి, చందానగర్ ప్రాంతాల నుంచి మూడు జాతాలు ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా పర్యటించాయి. పల్లెపల్లెకూ వెళ్లి ప్రజలను చైతన్యపరిచాయి. ఈ జాతాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయా గ్రామాల్లో ప్రజలు జాతాలకు సంఘీభావం తెలుపుతూ జాత బృందాలతో అడుగులో అడుగేశారు. నేడు ఇబ్రహీంపట్నంలో ముగింపు సభ జరగనుంది.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల జీవన స్థితిగతులపై మోపుతున్న భారాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాలను చైతన్యపర్చేందుకు మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లాలో జీపు జాతాలు నిర్వహించా రు. రంగారెడ్డి జిల్లాలో మజ్ధూర్ కిసాన్ సంఘర్ష్ ప్రచార జా తాలు ఈ నెల 16 తేదీన యాచారంలో, 18వ తేదీన శంకర్ పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సీపీఐ(ఎం) అనుబంధ ప్రజా సంఘాలు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతాలు ప్రారంభం అయ్యా యి. ఈ జాతలు పల్లెపల్లెకూ వెళ్లి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆయా మండలాల్లోని గ్రామాల్లో, పారిశ్రామికవాడల్లో తిరుగుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లను వివరించాయి. సామాన్య ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, పేదోడీ ఆకలి చావులకు కారణమవుతు న్న ప్రభుత్వ పనితీరును ప్రజలకు తెలియపర్చుతూ ముందుకు సాగాయి. ఈ జాతాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ జాతాలు గ్రామాల్లోకి వెళ్లిన సం దర్భంలో జాత బృందం నాయకులతో సామాన్యులు తమ గోడు వెల్లబోసుకున్నారు. పెరిగిన ధరలతో కనీసం మూడు పూటల కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితి దాపురించిందని, గ్యాస్ పక్కన పెట్టి.. మళ్లీ కట్టేలా పోయ్యిని వాడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. పండుగ పబ్బాలకు కొత్త బట్టలు కొనుగోలు చేయలేని ధీనమైన జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పని దోరికే పరిస్థితి లేదు. ఉపాధి హామీ పనులు పెడుతలేరు.. పనులు బంద్ పెడితే మళ్లీ వలస పోవాల్సిందే. ఇప్పటికే పట్నంలో అడ్డకూలికి పోవాల్సి వస్తోందని ప్రజలు తమ గోడును వెల్లబోస్తున్నారు.
'దినదిన గండంగా వ్యవసాయం రంగం ఉంది. ఎరువుల రేట్లకు హద్దు అదుపు లేదు. ఆరుగాలం పిల్లజెళ్ల కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే మార్కెట్లో ధర లేక నేల పాలుచేస్తున్నాం. టమాట పంట కొనుగోలు చేసేవారు లేక ఉన్నఫలంగా చేనులో వది లేస్తున్నాం. మా పంటకు గ్యారెంటీ ఎక్కడా ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న రైతు రాజ్యం ఎప్పుడూ వస్తాదో? మా బతుకులు ఎప్పుడూ మారుతవో.. మా పంటకు గిట్టుబాటు ధర ఎప్పుడు దక్కుతుందో' అని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఈ దోపిడీ పాలనను అంతం చేసేందుకు మీతో మేము సై అంటూ రైతుల నుంచి జాతాలకు మంచి మద్దతు లభించింది.
నేడు ఇబ్రహీంపట్నంలో జాతాల ముగింపు సభ
జిల్లాలో ఐదు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపర్చిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ప్రచారం జాత మంగళవారంతో ముగియనుం ది. జిల్లాలో తిరుగుతున్న మూడు జాతాల ముగింపు సభ ఇబ్రహీంపట్నంలో జరగునుంది. ఈ సభకు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికలు, కర్షకులు, సామాన్య ప్రజలు తరలిరానున్నారు.