Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి
- కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-తలకొండపల్లి
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ బలోపేతానికి సైనికులుగా పని చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చంద్రధన గ్రామ శివారులోని డోకూరి ప్రభాకర్ రెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ మండల కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద ర్భంగా పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి అధ్య క్షతన వహించిన సమావేశంలో ముఖ్య అతిథిలుగా కాంగ్రెస్ అధ్యక్షులు ఆట నరసింహ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శులు మిట్టపల్లి అంజయ్య, గుజ్జుల మహేష్ హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు , నాయకు లందరూ కలిసి కృషి చేద్దామన్నారు. ప్రతి కార్యకార్త ఒక సైనికుని లాగా పని చేయాలన్నారు. రాహుల్ గాంధీ చేపట్టి జోడో యాత్ర గురించి ప్రతి గ్రామంలోని గడపగడపకూ తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని, రైతులకు రుణమాఫీ , నిరోద్యోగ భృతి, ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరికీ పింఛన్లు, రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామని,కావాల్సిన యాంత్రికరణ పని ముట్లు సబ్సిడీపై అందజేస్తుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ కడ్తల్ మండలాధ్యక్షులు బిచ్చ నాయక్ ,దేవునిపడకల్ సర్పంచ్ శ్రీశైలం, ఎంపీటీసీ అంబాజీ, చంద్రధన మాజీ ఎంపీటీసీలు రాములు, వెంకటయ్య, నర్సమ్మ, శ్రీనివాసమూర్తి, డిగ్రీ కృష్ణ, సేవాదళ్ అధ్యక్షులు దశరథం, అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్చార్జి అజీమ్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రవీందర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు గౌడ్, మండల ఎన్ఎస్యుఐ అధ్యక్షులు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డేవిడ్, సుదర్శన్ రెడ్డి, చంద్రారెడ్డి, చిత్తరంజన్, మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు, సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ యువజన నాయకులు, ఎన్ఎస్ నాయకులు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.