Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ సభావాటు జాగిని
నవతెలంగాణ-తలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని సర్పంచ్ సభావాటు జాగిని అన్నారు. మంగళవారం వెంకటాపూర్ తండాలో కంటి వెలుగు శిబిరం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్ని కంటీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటి వెలుగులో పాల్గొన్న వారికి కంటి పరీక్షలు చేసి, కండ్ల జోడు అందజేసినట్టు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్కీ, సర్పంచ్ కుమారుడు రమేష్ నాయక్, వార్డు సభ్యులు శ్రీశైలం, శ్రీను, పత్యా నాయక్, గోపాల్ నాయక్, ఏఎన్ ఎంలు, ఆశా తదితరులు పాల్గొన్నారు.