Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల వెంకటేష్
- రావిచేడ్ గ్రామంలో విజయవంతమైన వైద్య శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్
పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని ట్రస్ట్ వ్యవ స్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామంలో మంగళవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఉప్పల అఖిల్ సారధ్యంలో కామినేని ఆస్పత్రి సౌజన్యతో నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న 411 మందికి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు అందజేసినట్టు డాక్టర్ ఉప్పల అఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రస్ట్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ హాజరై మాట్లా డారు గత రెండు దశాబ్దాలుగా కల్వకుర్తి నియోజక వర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడ్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉప్పల ట్రస్ట్ ఆదుకుంటుందన్నారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతితో కూడిన విద్యను అంది స్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా వేల సంఖ్యలో నియోజక వర్గంలోని ఆయా గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాల ఇంటి నిర్మాణానికి సహకారం అందజేస్తున్నట్టు తెలిపారు. కరోనా సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి బాధితులను అన్నివిధాలా ఆదుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టు కొని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు అందజేస్తున్నట్టు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ట్రస్ట్ తరపున ఆర్థికసాయం అందించి ఆదుకుంటున్నామని అన్నారు. రావిచేడ్ గ్రామంలో 25 మంది నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు పదవులతో సంబంధం లేకుండా రాజకీయాలకతీతంగా కొనసాగు తాయని ఉప్పల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ విఠలయ్య గౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, యాదయ్య, మాజీ ఎంపీటీసీలు రంగయ్య, యాదయ్య, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, ఉప్పల వెంకటేష్ యువసేన నాయకులు రవి కుమార్, మార్చ శేఖర్, జోగు రమేష్, విజరు, తిరుపతి, మహేష్, రాంరెడ్డి, వాసుదేవ్, ముబీన్, విజరు పాల్గొన్నారు.