Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 మండలాలు.. 138 కేంద్రాలు
- 72 గ్రామాల్లో బహిరంగ సభలు
- పదివేల మందిని కలిసిన ప్రచార జాత
- కళాకారుల ఆటాపాటలతో ప్రజలకు చైతన్మం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు చేపట్టిన ప్రచారజాత సుమారు పదివేల మందిని కలిసింది. ఈ నెల 16, 18వ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని మూడు కేంద్రాల నుంచి ప్రారంభమైన మూడు ప్రచార జీపు జాతాలు మంగళవారం ఇబ్రహీంపట్నంలో ముగిశాయి. సుమారు ఆరు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రచార జాతాలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలిశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. కళాకారులు తమ ఆట పాటల ద్వారా ప్రజల చైతన్యపరిచారు. తొమ్మిది సంవత్సరాల క్రితం దేశంలో ఉన్న ధరలు, ప్రస్తుత ధరలు పోల్చుతూ ప్రజలకు నాయకులు వివరించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాసు ధరల పెరుగుదలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. గతంలో రూ.450 ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1300లకు చేరిందని గుర్తు చేశారు. డీజిల్ సైతం లీటరుకు రూ.60 ఉంటే, నేడు సెంచరీకి చేరువాలో ఉందన్నారు. పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.120కి చేరిందని వివరించ గలిగారు. అంతేకాకుండా అంతే కాకుండా ప్రజలు నిత్యం పౌష్టికారానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. నిత్యావసర సరుకుల ధరలు అందనంత దూరం చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక విషయాలు ప్రజలకు వివరిస్తూ రంగారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో ఈ ప్రచార జాత సాగింది. 138 కేంద్రాల్లో ప్రచార జాత సాగింది. ఈ సందర్భంగా 72 గ్రామాల్లో సభను ఏర్పాటు చేశారు. సుమారు పదివేల మందికి పైగా ప్రజలను కలిసి కరపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రజాసంఘాల నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ఏప్రిల్ ఐదవ తేదీన ఢిల్లీలో జరగనున్న భారీ ప్రదర్శనకు భారీ సంఖ్యలో రంగా రెడ్డి జిల్లా నుంచి తరలి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ప్రచార జీపు జాత ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్తో పాటు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూడు ప్రచార జాతులకు సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయకత్వం వహించారు.