Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం హార్టికల్చర్ అధికారిని కనకలక్ష్మి
- నష్టపోయిన పంటలను పరిశీలన
నవతెలంగాణ-యాచారం
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామని ఇబ్రహీంపట్నం హార్టికల్చర్ అధికారిని కనక లక్ష్మి అన్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని మొండి గౌరెల్లిలో వడగండ్లతో మామిడి, టమాట ఇతర తోటలను పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు వడగండ్లతో నష్టపోయిన పంటలను అంచనా వేయడం జరిగిందని తెలిపారు. వడగండ్ల బాధితులందరిని ప్రభు త్వం ఆదుకుంటుందని గుర్తు చేశారు. బాధితులంతా ఎవరు ఆధైర్యం పడకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ, వార్డు సభ్యుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.