Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు కోసం 329 దరఖాస్తులు
- లక్కీ లాటరీ ద్వారా 12 మంది ఎంపిక ఎంపీపీ అనురాధ రమేష్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తుం దని ఎంపీపీ అనురాధరమేష్ తెలిపారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు నివేదిక కస్టర్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మయ్య ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ లబ్దిదారులను లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేశా రు. పెద్దేముల్ మండలానికి 12 యూనిట్లకు గాను, 12 లక్షలకు 329 మంది గాను, 245 పురుషులు, 84మంది మహిళలు మైనార్టీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. మైనార్టీ కార్పొరేషన్ లక్కీ డ్రాలో 4 మంది మహిళలు, 8మంది పురుషులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మైనార్టీ కార్పొరేషన్ లక్కీ డ్రాలో అవకాశం రాని వారికి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని సూచించారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ద్యావరి విజయమ్మ, గాజీపూ ర్ వీరప్ప, తట్టేపల్లి ఎంపీటీసీ శంకర్‌నాయక్, ఎంపీఓ షేక్ సుష్మ, వివిధ గ్రామపంచాయతీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీలు, తదితరులు పాల్గొన్నారు.