Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద గజాల స్థలం ప్రహరీ గోడ నిర్మాణం అడ్డగింత
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
నవతెలంగాణ-శంషాబాద్
పెద్ద పెద్ద నిర్మాణాలను వదిలేసి 100 గజాల్లో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని నిర్మాణ ప్రదేశానికి వెళ్లి దౌర్జన్యం చేస్తూ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ వార్డు సభ్యులు బలవంతంగా అడ్డుకుంటున్నారు. గ్రామ రెవెన్యూలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవా లని ఫిర్యాదు చేస్తూ తరువాత కొన్ని రోజులకు వాటి జోలికి వెళ్లడం లేదు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు చర్యలకు ఉపక్రమిస్తే వాటిని వదిలేసి కొత్త వాటిపై చర్యలు తీసుకో వాలని ఒత్తిడి తేస్తున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని చౌదరిగూడా గ్రామపంచాయతీ వార్డు సభ్యుల తీరిది. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 207లో ప్లాట్ నెంబర్ 14లో 102 చదరపు గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటు సంరక్షకుడు అదే గ్రామానికి చెందిన తాళ్ళ శ్రీనివాస్ ప్రహరీ గోడ నిర్మాణం కోసం గురువారం జేసీబీతో పునాది తీస్తున్నారు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలుసుకున్న గ్రామ పంచాయ తీ వార్డు సభ్యులు మల్చలం మహేష్, మామిళ్ళ మల్లేష్తో పాటు మునుగాల పరిపూర్ణ భర్త మునుగాల మహేష్ అధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే ప్లాట్ దగ్గర కు వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా ప్లాటు సంరక్షకున్ని బూతు మాటలు తిడుతూ చంపుతామని కట్టెలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాళ్ళ శ్రీనివాస్ మా ట్లాడుతూ గ్రామ రెవెన్యూలో పక్కనే వందల ఎకరా ల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వార్డు సభ్యులు వాటి జోలికి వెళ్లకుండా కేవలం 100 గజాల ప్లాటు రక్షణ కోసం నిర్మాణం చేస్తుంటే అడ్డుకోవడం ఏంటనీ ఆయన ప్రశ్నిం చారు. పెద్ద పెద్ద నిర్మాణాలను అడ్డుకోవాలని, చిన్న వాటి వరకు రావడం ఎందుకని అంటే 'అవి మీరు అడ్డుకోండి.. మాకేం సంబంధం' అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారని తెలిపారు. నిర్మాణం చేస్తున్నందుకు 'మాకు డబ్బులు ఇవ్వా లి' లేకుంటే అంతే సంగతి అంటూ అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చి దౌర్జన్యం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెటిల్ మెంట్ అయితే ఒక లెక్క కాకపోతే మరో లెక్క అన్న చందంగా వార్డు సభ్యుల తీరు ఉందన్నారు. అక్రమ నిర్మాణం పేరుతో వార్డు సభ్యులు దౌర్జన్యం చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
వార్డు సభ్యులు ఫిర్యాదు చేయలేదు: పంచాయతీ కార్యదర్శి, షమీం సుల్తానా చౌదరిగూడ
సర్వేనెంబర్ 207లో అక్రమ నిర్మాణం జరుగు తున్న ట్లు అడ్డుకోవాలని తమకు ముందస్తు ఫిర్యాదు చేయలేదు. వార్డు సభ్యులు అక్కడికి వెళ్ళారు. తనకు అక్కడి నుంచే సమచారం ఇచ్చి నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. వెంటనే రాకుంటే బాగుండదు అం టూ మాట్లాడారు. సి బ్బంది వెంటనే వెళ్లి అక్కడ పనులు నిలిపివేయ డం జరి గింది. ఇంతకు ముందే ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఇందిర మ్మ ఇండ్ల సమీపంలో సీలింగ్ ల్యాండ్ ఉందని అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతు న్నాయని ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కాకముందే వేరే నిర్మాణం వద్ద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామం 111 జీఓ పరిధిలో ఉన్నందున నిర్మాణాలకు అనుమతి లేని విషయం అందరికి తెలిసిందే. గ్రామంలోని అన్ని అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యక్తిగత రాజకీయ కక్షల కోసం ఒత్తిడి చేస్తున్నారు.