Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 14 నుంచి సీపీఐ బస్సు యాత్రలు
- 45 రోజుల పాటు కొనసాగుతున్న యాత్రలు
- ప్రజా సమస్యల ఎజెండాగా అధ్యయనం
- ఈ నెల 25న నియోజకవర్గం స్థాయి సమావేశం
- సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కావలి నర్సింహ, ఓరుగంటి యాదయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దేశంలో మత రాజకీయాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు సీపీఐ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కావలి నర్సింహ, ఓరుగంటి యాదయ్య తెలిపారు. అందుకుగాను ఏప్రిల్ 14 నుంచి సుమారు 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయా త్రలు, బైక్ యాత్రలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రజా సమస్యల ఏజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. అందుకు ఈ నెల 25న నియోజకవర్గం స్థాయి సీపీఐ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మాజీ శాసనసభ్యులు పొండిగారి రాములుతో కలిసి ఇబ్ర హీంపట్నంలోని డాక్బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటం నిర్వహిస్తామన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయనం కోసం బస్సు పాదయాత్రలు, జీపు జాతాలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఏప్రిల్ 14 నుంచి సుమారు 45 రోజుల పాటు ఈ యాత్రలను నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఇండ్ల స్థలాలు, భూ సమస్యలు, ధరణి, రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఫార్మాసిటీలో ప్రభుత్వ, సీలింగ్ పట్టాదారులకు నష్టపరిహారం చెందడం లేదన్నా రు. అనర్హులకే నష్టపరిహారం అందిందన్నారు. ఈ వ్యవ హారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశా రు. ఫార్మాసిటీలో సుమారు వంద కంపెనీలు వస్తే ఈ ప్రాంతం కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా వడగండ్ల వర్షం వలన నష్టపోయిన రైతాంగా న్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ భూ ములు, అసైన్ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతు ల్లోకి వెళ్లిన తర్వాత పట్టా భూములుగా మారుతున్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతు న్నారన్నారు. ఈ సమస్యల అధ్యయనం కోసమే సీపీిఐ క్ష్తేత్ర పర్యటనలకు పిలుపునిచ్చిం దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అలీముద్దీన్, పోచమోని నీలమ్మ శివరాల లక్ష్మయ్య, మండల కార్యదర్శి పూల యాదయ్య, మంచాల మండల కార్యదర్శి ఆంబోతు రాజు నాయక్ ఉన్నారు.