Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 1064 ఎకరాల్లో పంటలకు నష్టం వీటిలో 215 ఉద్యానవన పంటలు
- 849 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం
- ఎకరాకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం
- అన్ని రకాల పంటలకూ ఒకే రీతిలో నష్ట పరిహారం
- సీఎం హామీతో రైతుల్లో హర్షం
- కౌలు రైతులకూ అందనున్న పరిహారం
వడగండ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు సీఎం హామీ ఇచ్చారు. దాంతో రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల బాధిత రైతులకు రూ.కోటీ 64లక్షల నష్టపరిహరం తక్షణం అందనుంది. వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు ఇప్పటికే పంట నష్టం అంచనా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. దాంతో రైతులకు అకాల వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి అందుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించారు. ఈ మేరకు రైతుల ను ఆదుకుంటామన్నారు. కేంద్రంపై ఆధార పడకుం డా రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1064 ఎకరాల్లో వ్యవసా య, ఉద్యాన పంటలకు నష్టం చోటు చేసుకుంది. సు మారు రూ.50కోట్ల మేరకు రైతులకు నష్టం వాటిల్లిం ది. కాగా, ప్రభుత్వం కనీసం రైతులను ఆత్మస్తైర్యం దెబ్బతీసుకోకుండా తక్షణం ఆదుకుంటా మని ప్రకటిం చారు. 849 ఎకరాలు వ్యవసాయ పం టలకు నష్టం చోటు చేసుకోగా, 215 ఎకరాల్లో ఉద్యా న పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. మంచాల మండలం బోడకొండ, లోయపల్లి. శ్రీమంత్‌గూడ, చీదేడ్, దాద్‌పల్లి గ్రామాల్లో 410 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నాయి. ఆమనగల్లులో 10 ఎకరాల్లో ఆము దం, కొనపూర్లో 12ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 215 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అందులో 139 ఎకరాల్లో కూరగాయ పంటలు, 50 ఎకరాల్లో పండ్లతోటలు, 26 ఎకరాల్లో పూలతోటలు వర్షం దెబ్బకు పాడయ్యా యి. తలకొండపల్లి మండలంలోని వెలిజాలలో 15ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు గుర్తించారు. యాచారం మండలంలో 417 ఎకరాల్లో వరి, టమా ట, మామిడి పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. నల్లవెల్లి, చింతపట్ల, మొండిగౌరెల్లి, మంతన్గౌరెెల్లి గ్రామాల్లో 377ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టు గుర్తిం చారు. మొండిగౌరెల్లి, చింతపట్లలో టమాట 30 ఎకరాల్లో దెబ్బతినగా, నల్లవెల్లిలో 10 ఎకరాల్లో మా మిడి పంటలకు నష్టం చోటు చేసు కుంది. ప్రధానం గా వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడి, కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతి న్నాయి. వడగండ్ల వర్షం వల్ల అధిక మొత్తంలో నష్టం వాటిల్లిన వికారాబాద్ జిల్లాలో జిల్లా మంత్రి సబితా రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటిం చారు. పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించా రు. దాంతో వ్యవసాయాధి కారుల బృందం ఆధ్వ ర్యంలో జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు పం ట నష్టం అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలు నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది.
కౌలు రైతులకూ న్యాయం..
ప్రభుత్వం కేవలం పంటలు సాగు చేసిన రైతులకే కాకుండా, కౌలు రైతులను కూడా ఆదుకునేం దుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఆ వివరాలను కూడా సేకరిం చాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబ డులు పెట్టి సాగు చేసిన కౌలు రైతులు కూడా తీవ్రం గా నష్టపోయారన్నారు. వారికే పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ఇంకా వీడని భయం...
వడగండ్ల భీభత్సంతో రైతులు తీవ్రంగా నష్టపో యిన రైతులు ఇంకా తేరుకోలేదు. కాగా, మరో రెండు రోజులు కూడా వడగండ్ల వర్షం, అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో రైతులు మరింత భయంతో కాలం గడుపుతున్నారు. తేలి వస్తున్న మబ్బులతో భ యంతో ఆకాశం వైపు చూస్తున్నారు. తమ పంటలను రక్షణ ఏమిటనీ ఆందోళనతో ఉన్నారు.