Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గడపగడపకూ ప్రభుత్వ పథకాలు
- వడగండ్ల బాధితులను ఆదుకుంటాం
- మర్పల్లి అభివృద్ధికి రూ.30 లక్షలు
- 'మీతో నేను' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని, గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 'మీతో-నేను' కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామం లోని ఆయా వార్డుల్లో పారిశుధ్యాన్ని పరిశీలిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చ రించారు. మండల కేంద్రంలో పారిశుధ్య పనులు మరీ అధ్వానంగా ఉన్నాయని, వారం రోజుల్లోగా పనులు చేపట్టకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గడపగడపకూ తెలంగాణ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామంలోని ఐరన్ పోల్స్‌ను వెంటనే తొలగించి లూస్ వైర్లను సరిచేసి థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ తాగునీటి కోసం రూ.3 కోట్ల 20 లక్షల కోసం నిధు లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాగునీటి సర ఫరా పనులను ముమ్మరం చేసి ఇంటింటికీ తాగునీరు అందించాలన్నారు. కేవలం మండల కేంద్రానికి 2018 నుండి 2023 వరకు రూ.కోటీ 25 లక్షలు రైతు బీమా కింద, రూ.20 కోట్లకు పైగా రైతుబంధు కింద రైతులకు చెల్లించామన్నారు. మండల కేంద్రంలో 835 మందికి పింఛన్లు ఇచ్చామన్నారు. మండలంలోని గ్రామాల్లో 350 కోట్లతో ఇప్పటికే సీసీరోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. మండల కేంద్రంలో మరిన్ని అభివృద్ధి పనులకు రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో 86 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని, 93 ఎకరాల్లో 113 రైతుల కూరగాయలు పండ్ల తోటలకు నష్టం వాటిల్లిందని నష్టపోయిన రైతులం దరినీ ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉంద న్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. వికారాబాద్ నియోజక వర్గంలోని 131 గ్రామాలకు గాను127 గ్రామాల్లో 'మీతో-నేను' కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు నిర్మా ణం కోసం, బస్టాండ్ నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ వ హించి నిధులు మంజూరు చేయాలని జడ్పీటీసీ మధు కర్ ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సంగీతవసంత్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ ప్రభాకర్‌గుప్తా, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, కో -ఆప్షన్ సభ్యుడు సోహెల్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో రాజా మల్లయ్య, ఎంపీఓ మహేష్‌కుమార్, ఏవో వసంత, ఏపీవో అం జిరెడ్డి, ఏపీఎం, పట్టణ అధ్యక్షుడు గఫార్, మహిళా అధ్యక్షురాలు సంతోషి, డైరెక్టర్ యాదయ్య, గౌస్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షఫీ, ఎస్టీ సెల్ అధ్య క్షుడు జైసింగ్, నాయకులు రాచన్న, గోపాల్‌రెడ్డి, అశో క్, మధుకర్, రాచయ్య, రాజు, అశోక్, మోహన్, సుధా కర్, శేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.