Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2023-జాతీయ పంచాయతీల అవార్డులు
- 17 జీపిలకు పురస్కారాల అందచేత
- స్థానిక సర్పంచ్, పంచాయతీల కార్యదర్శులకు సన్మానం
- ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా వెల్లడి
నవతెలంగాణ-యాలాల
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని, గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను అభ్యున్నతి బాటలో నడి చేలా కృషి చేస్తే నాయకులకు మంచి పేరు వస్తుం దని ఎంపీపీ టి.బాలేశ్వర్ గుప్తా అన్నారు. మండల ప్రజా పరిషత్తు సమావేశం హాల్లో 2023 ఏడాదికి సంబంధించిన జాతీయ పంచాయతీ అవార్డులు, గ్రామ పంచాయతీలకు పురస్కారాలు అందచేతలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలం లోని 17 గ్రామ పంచాయతీలను ఉత్తమ జీపీలుగా ఎంపిక చేశారు. సర్పంచ్లకు, పంచాయతీల కార్యద ర్శులకు పురస్కారాలు అందజేసి శాలువ. పూల దండలతో ఘనంగా ఎంపీపీ బాలేశ్వర్ గుఫ్తా, ఎంపీ డీఓ పుష్పలీల తో కలిసి సన్మానించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాలాల మండ లం అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగుతుంద న్నారు. తాండూర్ శాసన సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. తమ గ్రామాలను అభివృద్ధి పరు చుకునేందుకు సర్పంచులు పోటీ పడుతున్నారని అన్నారు. తప్పకుండ ఎంఎల్ఏ సహాకారంతో మం డలంలోని అన్ని గ్రామాలకు నిధుల వరధ త్వరలో రానున్నట్లు ఆయన తెలియచేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీల కార్యద ర్శులు, జిల్లా కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబ, అధికారులు పాల్గొన్నారు.