Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-నవాబుపేట్
మండలంలోని అన్ని గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని నవాబుపేట ఎంపీపీ కాలే భవాని అన్నారు. జా తీయ ఉత్తమ పంచాయతీ అభివృద్ధి సమావేశం శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జాతీయ ఉత్తమ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో 9 అంశాలను పరిగణలోకి తీసుకొని అందులో 1,2,3 కేటగిరీలుగా విభ జించి ఉత్తమ గ్రామ సర్పంచులుగా ఎంపిక చేసినట్టు తెలి పారు. 32 గ్రామ పంచాయతీలకు గాను అందులో నుంచి 27 అవార్డులు ఎంపిక చేసి సర్పంచులను ఎంపీటీసీలను గ్రామ పంచాయతీ కార్యదర్శులను సన్మానించి అవార్డులు అందజేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు పల్లె ప్రకృతి వ నం క్లీన్ అండ్ గ్రీన్ పాటించడంతో ఈ అవార్డులకు ఎంప ిక చేసినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణ ముండే విధంగా సర్పంచులు కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలేజయమ్మ, ఎంపీడీవో సుమిత్రమ్మ ఎంపీఓ విజరు కుమార్ సర్పం చుల సంఘం అధ్యక్షులురావు గారి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.