Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. కందుకూరు మండల ఆకులమైలారం గ్రామంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గోరింక కళమ్మ రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని సూచించారు. వైద్యాధి కారులు కంటి పరీక్షలు చేసి,కండ్ల అద్దాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా ప్రభుత్వమే ఆపరేషన్లు చేయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మన్నె జయేందర్, ఎంపీటీసీ పద్మపాండు, మాజీ సర్పంచులు నందిశ్వర్,అంజయ్య ,ఉప సర్పంచ్ రాంరెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, యూత్ అధ్యక్షులు కోలన్వి విగేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, కార్యాలయ కార్యదర్శి బర్కం వెంకటేష్, ఎస్సీసెల్ అధ్యక్షులు సామయ్య, సదానంద్ గౌడ్, అమరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.