Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు నయీం అప్పు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని మాటలు చెప్పే బ్రో కర్లను నమ్మవద్దని తాండూరు పట్టణ బీఆర్ ఎస్ అధ్యక్షులు అప్పు నహీం మంగళవారం ఒక ప్ర కటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ నారా యణ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు రెవె న్యూ శాఖ తాండూరు పట్టణంలో 6 కేంద్రాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖా స్తును సేకరిస్తోందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు దరఖాస్తును సమర్పిం చి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తె లిపారు. తాండూరు పట్టణ ప్రజలు ఇలాంటి బ్రోకర్లను నమ్మవద్దని, ఇలాం టి మోసాలకు గురికావద్దని తెలిపారు. ఎవరైనా దరఖాస్తు కోసం లేదా డబు ల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడం కోసం డబ్బు డిమాండ్ చేస్తే ఈ నంబర్‌కు 9985807124 సంప్రదించాలని తెలిపారు.