Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని మినీ స్టేడియం, చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి హెచ్ఎండీఏ నుంచి రూ.3కోట్ల, నిధులు మంజూరయ్యాయని వాటితో 2.5 ఎకరాల్లో అధునాతన అంగులతో నిర్మించబోయే మోడ్రన్ చేవెళ్ల బస్టాండ్‌ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న మినీ స్టేడియం పనులు నెల రోజులో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామ న్నారు. గత ప్రభుత్వ హాయంలో చేపట్టిన మినీ స్టేడియం పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో క్రీడకారులు ఎం తో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలి పారు. తన సొంత నిధులు రూ.40 లక్షలతో పనులు చేప డుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ఎందుకు ఆగిపోయాయని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడగడంతో డబ్బులు సరిపో వడం లేదని బదులు ఇచ్చాడు. దీనికి ఎంపీ స్పందిస్తూ రూ.20లక్షలు ఇస్తానని పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది నుంచి డిగ్రీ కళాశాలలో ఆడ్మి షన్లు కూడా తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. తెలం గాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్టీసీ డిపో లు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. బస్టాండ్ ఆవరణలో కమర్షియల్ కాంప్లెక్ ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పించి, తెలంగాణలోనే గ్రీన్, స్వచ్ఛ బస్టాండ్‌గా మార్చు కుందామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయ లక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రిగిధర్ రెడ్డి, నర్సింలు, మాణిక్యరెడ్డి, డైరెక్టర్లు తెలుగు వెంకటేష్, కృష్ణ, ఫయాజ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు రాములు, సీనియర్ నాయ కులు మర్పల్లి కృష్ణారెడ్డి, రమణారెడ్డి, రఘు, ప్రకాష్‌గౌడ్, తదితరులు ఉన్నారు.