Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్ ఆర్టీసీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యు బుగ్గప్ప
నవతెలంగాణ-యాలాల
జుంటిపల్లి సీతారామచంద్రస్వామి జాతర మహౌత్సవం పేరుతో పేద ప్రజల నుండి అదనంగా చార్జీలు వసూ లు చేస్తున్న తాండూరు ఆర్టీసీ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) యాలాల మండల కార్యదర్శి యు.బుగ్గప్ప గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 'మండలంలోని జుంటుపల్లి గ్రామ సమీపంలోని సీతారాముల కల్యాణం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీగా జాతరకు తరలివస్తుంటారు. దీన్ని ఆసరా చేసుకున్న తాండూరు ఆర్టీసీ యాజమాన్యం గురువారం తాండూరు నుండి జుంటిపల్లి జాతరకు ప్రత్యేక బస్సులు కొనసాగించారు. తాం డూరు నుంచి జుంటిపల్లి వరకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుం ది. కానీ ఆర్టీసీ యాజమాన్యం తాండూరు నుండి జుంటిపల్లి వర కు వెళ్లే ప్రత్యేక బస్సులో ప్రయా ణించే ప్రజల నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. కానీ రూ.20 మాత్రమే వసూలు చేయాలి. ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా జుంటిపల్లి జాతరకు రూ.50 వసూలు చేయాలని నిర్ణయిస్తే తాండూర్ నుండి జుంటిపల్లి పేరుతో టికెట్ ఇవ్వాలి. పక్క రాష్ట్రం కర్ణాటకలోని చించోలి పేరుతో టికెట్ ఇవ్వడం అన్యాయం. వెంటనే తాండూరు ఆర్టీసీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' అని ఆయన డిమాండ్ చేశారు.