Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలతో కిటకిటలాడిన ఆలయాలు
- భాజా భజంత్రీలు పెళ్లి మండపాలతో అలంకరించిన రామాలయాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
శ్రీరామ నవమినీ పురస్కరించుకొని రామాలయాలు ప్రజలతో కిటకిటలాడాయి. పచ్చని పందిళ్లు తోరణాలతో పెళ్లి మండపాల అలంకరించుకున్నాయి. ప్రజల రద్దీతో శోభాయమానంగా మారాయి. అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించారు. భాజా భజంత్రీలతో పెళ్లి మండపాలు మారుమోగాయి. అందులో భాగంగా చర్ల పటేల్‌గూడలో మాజీ పట్వారి రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింహరెడ్డి రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి స్రవంతి కుటుంబ సభ్యులు మేళాతాళాల మధ్య తన ఇంటి నుండి వేడుకగా బయలుదేరి స్వామి వార్లకు నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిలత్ లగంలో అర్చకులు సాంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ పట్వారి రాంరెడ్డి సూచనలకు అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్బంగా మాజీ పట్వారీ రాంరెడ్డి మాట్లాడుతూ... సీతారాముల దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సీతారాముల అనుగ్రహం అందరికి లభించాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే అచ్చమైన పండుగ శ్రీరామనవమని రాష్ట్రంలో తెలుగు వాకిళ్ళన్ని పండుగ శోభయామానంతో కళకళలాడుతూ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా ఈ పండుగ అందరికీ శుభాలను, చేకూర్చాలని, రైతులకు సకాలంలో పాడిపంట లు సమద్ధిగా పండి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంబాలపల్లి గీత రాంరెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ గణేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.